సంబంధిత వార్తలు
కలలో దీపం కనిపిస్తే ఏమవుతుంది?
కలలు చాలామందికి వస్తుంటాయి. ఒక్కో కల ఒక్కో రకంగా వస్తుంటుంది. కొందరికి కలలో దీపం కనిపిస్తుంది. ఐతే అలా కనిపించిన దీపం ఎలాంటిదన్న దానిపై ఫలితం ఆధారపడి వుంటుందని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. బాగా ధగధగ వెలుతురునిచ్చే దీపం కలలో కనబడితే భవిష్యత్తు బ్రహ్మాండంగా వుండబోతుందని సంకేతం.
అలా కాకుండా కలలో కనిపించిన దీపం క్రమంగా వెలుగు తగ్గిపోతున్నట్లు కనిపిస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే సూచనలు వున్నట్లు గుర్తించాలి. కలలో దీపం మండుతూ కిందపడి పోతున్నట్లు కనిపిస్తే అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెపుతున్నారు.
దీపాన్ని ఒక గది నుంచి మరో గదిలోకి తీసుకెళ్తున్నట్లు కల వస్తే... స్వేచ్ఛాయుత జీవితం రాబోతుందని అర్థం. దీపాన్ని వెలిగిస్తున్నట్లు కల వస్తే.. ధనం, డబ్బు సమకూరుతుందని తెలుసుకోవాలి.
