మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (15:09 IST)

శ్రీకృష్ణ భగవానుడు నా కలలో వచ్చి అలా చెప్పాడు.. అఖిలేష్ యాదవ్

యూపీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ భగవానుడు తన కలలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్‌ను మధుర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపమన్నాడంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ రాసిన లేఖకు కౌంటర్‌గా అఖిలేశ్ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వస్తాడని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ చెప్తున్నారని వెల్లడించారు
 
ఇంకా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. "బాబా (యోగి ఆదిత్యనాథ్) విఫలమయ్యారు. ఎవరూ ఆయన్ను కాపాడలేరు. ప్రతి రోజు రాత్రి కృష్ణుడు నా కలలోకి వస్తాడు. యూపీలో అధికారం మాదేనంటూ చెబుతున్నాడు’’ అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆజాంగఢ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.