శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (12:08 IST)

విడాకుల తర్వాత సమంతకు ఆఫర్లే ఆఫర్లు.. నయనతారను ఫాలో అవుతున్న శామ్!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చైతూతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి సమంత కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇంకా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. 
 
దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సామ్‌ ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంత తన సినిమాలు, షూటింగ్‌ల విషయంలో దర్శకులకు కొత్త నిబంధనలు పెడుతోందట. 
 
వాటికి సరే అంటేనే సినిమా సైన్ చేస్తోందట. అలాగే సినిమా ప్రమోషన్స్‌కు కానీ, ఇతర ఈవెంట్స్‌కు నయన్‌ హజరయ్యేందుకు ఇష్టం పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సామ్‌ కూడా నయనతార తరహాలోనే కండిషన్స్‌ పెడుతోందంటూ సినీ వర్గాలు చర్చించకుంటున్నాయి. 
 
ఇక సమంత కండీషన్స్‌ కూడా అంత ఇబ్బందికరంగా లేకపోవడంతో దర్శక-నిర్మాతలు కూడా ఒకే అంటున్నారట. తాను ఒప్పుకుంటున్న సినిమాల షూటింగ్స్‌ కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని నిర్మాతలకు కండీషన్స్‌ పెడుతోందట సామ్‌. ఒకవేళ హైదరాబాద్‌లో షూటింగ్‌ అయితే ఇండోర్‌ మాత్రమే పెట్టాలని కోరుతుందట.  
 
అలాగే శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించబోతున్న ఓ మూవీ కోసం ఆయన సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి తాను సైన్‌ చేసేందుకు పైన పేర్కొన్న కండిషన్స్‌ పెట్టిదట సమంత. అలాగే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం సామ్‌ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
హరి, హరీశ్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం షూటింగ్‌ నవంబర్‌ నుంచి మొదలు కానుందట. కాగా కేవలం ఇండోర్‌ షూటింగ్స్‌కే నయన్‌ ఆసక్తి చూపుతోందని గతంలో వార్తలు వినిపించాయి.