బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:43 IST)

అలయ్-బలయ్ లో వెంకయ్య, తమిళిసై

జలవిహార్​లో అలయ్-బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమానికి హాజరై.. సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
 
సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించిన గవర్నర్హైదరాబాద్ జలవిహార్‌లో అలయ్-బలయ్ కార్యక్రమం జరుగుతోంది. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. తమిళిసైకి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు.
 
మహిళలతో గవర్నర్ నృత్యాలుఅనంతరం అలయ్ బలయ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ ప్రారంభించారు. మహిళలతో కలిసి నృత్యం చేశారు. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ పర్యవేక్షిస్తున్నారు.పాల్గొన్న పవన్ కల్యాణ్అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరైన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని కోరుకునేవాన్నని తెలిపారు.

అనంతరం దుర్గామాతకుప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడు చేతుల మీదగా దుర్గామాతకు, జమ్మిచెట్టుకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో దత్తాత్రేయ,కిషన్‌రెడ్డి,పవన్‌కల్యాణ్​తో పాటు తదితరులు పాల్గొన్నారు. కరోనా దృష్ట్యాఆలింగనాలతో కాకుండా.. నమస్కారాలతోఅలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది.