గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:09 IST)

గవర్నర్ తమిళిసై విమోచన దినంపై సంచలన ట్వీట్

గవర్నర్ తమిళిసై విమోచన దినంపై సంచలన ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17 విమోచన దినం జరుపుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.
 
భారత దేశానికి ఆగస్టు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1947 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నిజాం సర్కార్ నుంచి తెలంగాణను భారత్ దేశంలో విలీనం చేశారు. 
 
అయితే సెప్టెంబర్ 17పై రాజకీయంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇది విమోచన దినోత్సవమా? విలీన దినోత్సవమా? లేక విద్రోహ దినోత్సవమా? అనే వివాదం నడుస్తోంది. బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 
 
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ఈరోజు విలీన దినోత్సవమని, కాంగ్రెస్ పార్టీ కూడా విలీన దినోత్సవమని అంటోంది. బీజేపీ మాత్రం విమోచనదినంగా చెబుతోంది. ఇప్పుడు గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ బీజేపీ నేతల హడావుడికి మద్దతు తెలిపినట్లుగా కనిపిస్తోంది.