1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:36 IST)

రాత్రిపూట తలదువ్వడం, గోర్లు కత్తిరించడం కూడదు.. ఎందుకో తెలుసా?

ఆధునిక పోకడలతో రాత్రిపూట తలదువ్వడం, గోర్లు కట్ చేసుకోవడం ఫ్యాషనైపోయింది. అయితే రాత్రిపూట గోర్లు, జుట్టు కత్తిరించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. రాత్రిపూట జుట్టు కత్తిరించడం, దువ్వడం వంటివి మంచ

ఆధునిక పోకడలతో రాత్రిపూట తలదువ్వడం, గోర్లు కట్ చేసుకోవడం ఫ్యాషనైపోయింది. అయితే రాత్రిపూట గోర్లు, జుట్టు కత్తిరించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. రాత్రిపూట జుట్టు కత్తిరించడం, దువ్వడం వంటివి మంచిది కాదని.. అవి అశుభానికి సంకేతాలని వారు సూచిస్తున్నారు. అలాగే సాయంత్రం 6 దాటాక ఇల్లు ఊడ్చకూడదని, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకుని తింటే శుభం జరుగుతుందని పండితులు అంటున్నారు. 
 
రాత్రివేళలో గోర్లు, జుట్టు ఎందుకు కత్తిరించకూడదు..?
రాత్రి పూట గోర్లను, జుట్టును కత్తిరిస్తే దుష్ట శక్తులు ఆవహిస్తాయని విశ్వాసం. కాని నిజానికి పూర్వ కాలంలో నేల్ కట్టర్ ఉండేవి కాదు కాబట్టి, పదునుగా ఉన్న కత్తులతో గొర్లను కత్తిరించుకునేవారు. పొద్దంతా పనులు చేసుకొని రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కరెంటు ఉండేది కాదు కాబట్టి.. చీకట్లో గోర్లు కత్తిరించునేటప్పుడు అప్పుడప్పుడు వెళ్ళు తెగేవట. అందుకే అప్పటి నుండి రాత్రి వేళల్లో గోర్లు, జుట్టు కత్తిరించవద్దని అంటారు. 
 
అయితే నిజానికి రాత్రిపూట గోర్లను కట్ చేయడం.. జుట్టు విరబోసుకుని తిరగడం, జుట్టు కత్తిరించడం, దువ్వడం అశుభ సూచకాలని పండితులు అంటున్నారు. అలాగే మంగళ, శుక్రవారం పూట, పండగ రోజుల్లో గోర్లు కట్ చేయడం మంచిది కాదు. వైదిక కర్మ ప్రకారం పండగ రోజుల్లో కత్తులు, కటర్లు వంటి టూల్స్ ఉపయోగించడం సైన్స్ పరంగానూ, ఆధ్యాత్మికంగా మంచిది కాదు. హెయిర్‌కట్, షేవింగ్ వంటివి రాత్రిపూట చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.