1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Do you know what is the uniqueness of Vibhooti bath?

భస్మ స్నానం విశిష్టత ఏమిటో తెలుసా?

uniqueness of Vibhooti bath
భస్మ స్నానం చేసినవాడు తన వంశాన్ని ఉద్దరిస్తాడు. దీనిని మించిన స్నానం లేదు. విభూతి సర్వ రోగాలను తిప్పితిప్పి కొడుతుంది. పిల్లల్లో వచ్చే భయాలు, జ్వరాలు మొదలైనవి దూరం చేసే హక్కు విభూతిది. లలాటం మీద విభూతిని పూసుకుంటే శిరస్సులో చేసిన పాపాలు హరిస్తాయి. బ్రహ్మని భాసితం చేస్తుంది కనుక భసితము అన్నారు.

 
అణిమాది అష్టవిభూతులు ప్రసాదిస్తుంది కనుక విభూతి అన్నారు. ఇది రక్ష. విభూతి క్రోధాన్ని హరిస్తుంది. బాహువుల మీద పూసుకుంటే పాపాలు నశిస్తాయి. నాభి మీద పూసుకుంటే పరాయి స్త్రీ వ్యామోహం దరిచేరదు. గుండెల మీద పూసుకుంటే మానసిక ఆందోళన దరిచేరదు.

 
మూడు పూటలా విభూతి ధరిస్తే చర్మరోగాలు రావు. సమస్త శుభములను పొందుటకు వారధి.. శ్రీసాయి దివ్య విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు చెబుతాడు. అటువంటి విభూతి ధరించిన పరమేశ్వరుని పూజ శాంతిసౌభాగ్యదాయకం.
About Writer
సిహెచ్