శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (20:36 IST)

విభూతి అంటేనే ఐశ్వర్యం.. పరమేశ్వరుని కన్నీటి ధార నుంచి..?

విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసుకోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక ఆవుపేడకు విశేషమైన ప్రాముఖ్యం వుంది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం.
 
లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు.
“వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయా ! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!!
 
భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే .రుద్రాక్ష మాలను కంతమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు. అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు.
 
 విభూతి ధారణవల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.