ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (13:21 IST)

ఏకాదంత సంకష్ట చతుర్థి 2021: మోదకాలు.. గరిక మాలను మర్చిపోవద్దు..

ఏకాదంత సంకష్ట చతుర్థిని మే 29 శనివారం జరుపుకుంటున్నారు. చతుర్థి తిథి మే 29న ఉదయం 6.33 గంటలకు ప్రారంభమైంది. ఆ తిథి మే30 న ఉదయం 4.03 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా ప్రతి నెలలో సంకష్ట చతుర్థిని జరుపుకుంటారు.

అయితే ఈ ఏకాదంత సంకష్ట చతుర్థి రోజున గణేశుడిని విశేషంగా పూజిస్తారు. వైశాఖ మాసంలో సంకష్ట చతుర్థిని 'ఏకాదంత సంకష్ట చతుర్థి' అని పిలుస్తారు. గణేశుడి భక్తులు ఈ రోజు ఉపవాసం పాటిస్తారు. భగవంతుడు తన భక్తుల జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి వారికి ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తాడని నమ్ముతారు.
 
సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు భక్తులు ఏకాదంత సంకష్ట చతుర్థి వ్రతాన్ని పాటిస్తారు. చంద్రుడిని చూడటం ద్వారా ఉపవాసాన్ని ముగిస్తారు. కొంతమంది భక్తులు చతుర్థి సూర్యోదయం మీద ఉపవాసం ప్రారంభించి మరుసటి రోజు ఉదయంతో ఉపవాసం ముగిస్తారు. ఈ ఏకాదంత చతుర్థిని అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు. శనివారం వచ్చే చతుర్థి రోజున విఘ్నేశ్వరుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
Ganesh
 
గణేశుడి ఆలయంలో ఈ రోజున దీపమెలిగించడం కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా వినాయకుడికి జరిగే అభిషేకాలు వీక్షించే పాపాలు హరించుకుపోతాయి. ఈ రోజున గణేశుడికి పువ్వులు అర్పించండి. గణేశుడికి గరిక మాలను సమర్పించండి. గణేశుడికి సింధూరం సమర్పించండి. వివిధ నామాలతో గణేశుడిని ధ్యానించండి. మోదకాలను లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.