మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (22:22 IST)

విభూతిని ఏ వేలితో పెట్టుకోవాలి?

విభూతిని ఎలా ధరించాలి? విభూతి ధారణకు ఏ వేలిని ఉపయోగించాలి? విభూతిని బొటన వేలుతో నుదుటన ధరిస్తే వ్యాధులు తప్పవు. చూపుడు వేలితో విభూతిని ధరిస్తే వస్తువుల నాశనం తప్పదు. 
 
కానీ మధ్యవేలితో విభూతిని ధరించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఉంగరపు వేలి ద్వారా విభూతిని తీసుకుని నుదుటన పెట్టుకుంటే.. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. కానీ చిటికెన వేలితో విభూతి తీసుకుని నుదుటన ధరిస్తే మాత్రం గ్రహదోషాలు తప్పవని నిపుణులు చెపుతున్నారు. 
 
ఉంగరపు వేలు- బొటన వేలిని విభూతి ధారణకు ఉపయోగించవచ్చు. ఉంగరపు వేలు, బొటన వేలు.. ఈ రెండింటితో విభూతి తీసుకుని ఉంగరపు వేలితో మాత్రమే విభూతిని ధరిస్తే అనుకున్న కార్యాల్లో జయం వరిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది. శుభఫలితాలుంటాయి. అలాగే విభూతి ధరించేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు నిలుచోవాలి. విభూతిని కింద రాలనీయకుండా ధరించాలి.