గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (08:43 IST)

43 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర - జూన్ 30 నుంచి ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ యాత్రను ఈ యేడాది ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతం తెలిపాయి. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా ఈ యాత్ర జూన్ 30వ తేదీ నుంచి మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రలో ప్రతి యేటా మంచు శివలింగ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ యేడాది అమర్‌నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జూన్ 30వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్రను ముగిస్తారు. అయితే, ఈ యాత్రను కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని జేకే ఎల్జీ మనోజ్ సిన్హా సారథ్యంలోని అమర్నాథ్ ఆలయ బోర్డు నిర్ణయించింది.