మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (11:52 IST)

పంజాబ్‌ను ఊడ్చేసిన "చీపురు" - వెనుకంజలో అమరీందర్, చన్నీ, సిద్ధూ

పంజాబ్ రాష్ట్రాన్ని చీపురు ఊడ్చేసింది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి గత నెలలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు బుధవారం జరిగింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళుతోంది. 
 
మొత్తం 117 అసెంబ్లీ సీట్లకుగాను ఆప్ పార్టీ 89 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ 15, శిరోమణి అకాలీదళ 8, బీజేపీ 4, ఇతరులు ఒక చోట అధికారంలో ఉన్నారు. 
 
అయితే ఈ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన అమరీందర్ సింగ్, ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధూలు వెనుకంజలో ఉన్నారు. అకాలీదళ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ లంబీ స్థానం నుంచి పోటీ చేసి వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి గుర్మీత్ సింగ్ కుదియాన్ ఆధిక్యంలో ఉన్నారు. 
 
పంజాప్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఆయన వెనుకంజలోనే ఉన్నారు. ఇక అమృతసర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సాద్ నేత బిక్రమ్ మజితా కూడా వెనుకంజలో ఉన్నారు.