సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (10:34 IST)

మాది మగాళ్ళ రాష్ట్రం - అందుకే రేప్ కేసుల్లో అగ్రస్థానం : రాజస్థాన్ మంత్రి

తమది మగాళ్ళ రాష్ట్రమని అందుకే అత్యాచార కేసుల్లో మొదటి స్థానంలో ఉందని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ చెప్పారు. ఈ ప్రకటన కూడా సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీలో చేశారు. మనది మొగోళ్ళ రాష్ట్రం. అందుకే రేప్ కేసుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలో సైతం విమర్శలు చెలరేగాయి. 
 
"మనం అత్యాచారం కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం" అని అసెంభ్లీ సాక్షికా తెలిపారు. ఈ వ్యాఖ్యలప రాష్ట్రంలోని మమహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.