మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (11:29 IST)

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న మెజార్టీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు. ఇందులో బీజేపీ తన సత్తా చాటుతోంది. మొత్తం 403 స్థానాలకు కూడా ఏకంగా ఆ పార్టీ 254 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 202 స్థానాలు. కానీ, బీజేపీ ఈ మెజార్టీని దాటిపోయింది. ఉదయం 11 గంటల ప్రకారం ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, బీజేపీ 254, ఎస్పీ 118, బీఎస్పీ 5, ఇతరలు 6 చొప్పున సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
అలాగే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46, కాంగ్రెస్ 20, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 13, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మణిపూర్‌లో బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఇతరులు 23 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.