1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (09:32 IST)

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : కాషాయం రెపరెపలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 269 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 160, ఎస్పీ 95, బీఎస్పీ 6, కాంగ్రెస్ 4, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రమైన పంజాబ్‌లో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటర్లు దగ్గరకు కూడా చేర్చలేదు. ఇక్కడ కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టారు. మొత్తం 117 స్థానాలకు కూడా 104 స్థానాల్లో ట్రెండ్స్ వెల్లడయ్యాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీకి 46, కాంగ్రెస్ 38, అకాలీదళ 14, బీజేపీకి 4, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.