గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (10:59 IST)

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు : నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించే దిశగా సాగుతోంది. ముఖ్యంగా, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోమారు అధికారంలోకి రానుంది. అలాగే గోవాలనూ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా కాషాయం హవా కొనసాగుతోంది. కానీ, పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్లు పట్టంకట్టారు. 
 
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు యూపీలో బీజేపీ 256, ఎస్పీ 122, బీఎస్పీ 7, కాంగ్రెస్ 5, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ 44, కాంగ్రెస్ 21, బీఎస్పీ 2, ఏఏపీ 1, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 89, కాంగ్రెస్ 13, అకాలీదళ్ 9, బీజేపీ 5, ఇతరులు ఒకచోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
గోవాలో 40 సీట్లకు గాను బీజేపీ 19, కాంగ్రెస్ 12, టీఎంసీ 5, ఏఏపీ 1, ఇతరు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 సీట్లకుగాను బీజేపీ 44, కాంగ్రెస్ 21, బీఎస్పీ 2, ఏఏపీ 1, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మణిపూర్‌లో 60 సీట్లకు గాను బీజేపీ 23, కాంగ్రెస్ 12, ఎన్.పి.పి 10, జేడీయూ 6, ఇతరులు 9 చొట్ల ఆధిక్యంలో ఉన్నారు.