సంబంధిత వార్తలు
- Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్
- Vadodara car crash: గుంతలున్నాయ్.. కారు అదుపు తప్పింది.. అందుకే ప్రమాదం..
- దేశంలోనే తొలి అర్బన్ రోప్ వే సేవలు.. వ్యయం రూ.807 కోట్లు!!
- Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?
- Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?
కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి
శివ పురాణం ప్రకారం, కాలాష్టమి రోజు కాల భైరవుడిని ఆరాధించడం వలన నవ గ్రహాల ప్రతికూల ప్రభావాలు, రాహు కేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఆదిత్య పురాణం - కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాల భైరవుడిని పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది.
ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం.
కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. తేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.
బ్రహ్మ శిరస్సును ఖండించిన శివుని స్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాప ప్రక్షాళనకు ఘోరమైన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరకు వారణాసికి చేరుకున్నాడు. అక్కడ కాలభైరవునికి మోక్షం కలుగుతుంది. అందుకే కాశీకి వెళ్ళినవారు కాలభైరవుని తప్పకుండా దర్శించుకోవాలి.
తర్వాతి కథనం
