Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?
నవగ్రహాలలో బృహస్పతి సొంత రాశిలో బుధుడు ప్రవేశించడం కారణంగా మీనరాశిలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. అందులో వృషభం, మిథునం, కన్యారాశి, మకరం వున్నాయి. ఈ యోగం ద్వారా వృషభ రాశికి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ సౌఖ్యం వుంది.
అలాగే మిథునరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వుంటాయి. పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో వృద్ధి వుంటుంది.
ఇక కన్యారాశి జాతకులకు ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది. పూర్వీకుల ఆస్తులు వస్తాయి. ఉద్యోగులకు అన్నీ కలిసివస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
చివరిగా మకరరాశి జాతకులకు ప్రమోషన్లు అందుతాయి. అనుకున్న కార్యాల్లో విజయాలు వరిస్తాయి. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.