మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు కొనసాగిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ముఖ్యులను కలుసుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
మిథనం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవదు. శుభకార్యానికి హాజరవుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కొత్త పనులు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు పురమాయించవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చేస్తున్న పనిపై దృష్టిపెట్టండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతితో అకారణ కలహం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు.