కుక్కకాటును నయం చేసే ''కుక్‌రైల్ నాలా'' స్నానం
|
మీరు నమ్మినా నమ్మకపోయినా, లక్నోలోని ప్రధాన ప్రాంతమైన ఫయిజాబాద్ రోడ్డులో గల ఈ వాగులో కుక్కకాటుకు విరుగుడుగా ప్రజలు స్నానం చేసే తంతు అనేక సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది. కుక్కకాటు నుంచి ఉపశమనం పొందేందుకు దూరప్రాంతాల నుంచి సైతం అనేక మంది కుక్కకాటు బాధితులు ఇక్కడకు వస్తుంటారు. ప్రత్యేకంగా అధికారులైన కొందరు ఐఏఎస్ అధికారులు సైతం ఇక్కడకు వచ్చి స్నానం చేస్తుంటారని స్థానికులు అంటున్నారు.
వాగునకు ఒకవైపు మురికివాడ ఉండగా మరోవైపు స్థలం ప్రజల స్నానానికై నిర్దేశించబడింది. స్థానికుల సమాచారాన్ని అనుసరించి రాజధానికి 20 నుంచి 30 కి.మీ.ల దూరంలో గల 'బక్షి కా తాలాబ్' (కొలను) నుంచి ఆవిర్భవించిన ఈ వాగు 'భైయిసాకుండ్' యొక్క గోమ్‌తీ బాయిరాజ్‌లోకి ప్రవహిస్తుంది. ఈ కుక్‌రైల్ వాగు (ఫయిజాబాద్ రోడు యొక్క బ్రిడ్జ్ దిగువన)లో స్నానం చేసినట్లయితే కుక్కకాటు తాలూకూ విషప్రభావం తొలగిపోతుందని ఒక నమ్మిక.
కుక్కకాటుకు గురై ఉపశమనం కోసం స్నానం చేసే నిమిత్తం ప్రతి రోజు ఉదయం పెద్ద సంఖ్యలో బారులు తీరిన జనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. స్నానం చేసిన అనంతరం 'సట్టు' (ఉలవలు మరియు గోధుమల మిశ్రమ పిండి) మరియు 'గుడ్' (బెల్లపు పాకం)లతో చేసే ప్రత్యేక ప్రార్థనలో వాళ్ళు పాల్గొంటారు. కుక్కకాటు
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నాలుగు తరాలుగా తమ కుటుంబం ఈ విధమైన చికిత్సను చేస్తున్నదని సంజయ్ జోషి చెప్పుకొచ్చాడు. మన్‌కామేశ్వర్ దేవాలయానికి సమీపంలోని కాలనీలో అతడు నివాసముంటున్నాడు. చికిత్సలో వినియోగించే ఇనుప పటకారును అతడు మాకు చూపించాడు. ప్రత్యేక ప్రార్థన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన అతను, అదేసమయంలో భైరవదేవుని తాను ప్రార్థిస్తానని మాతో చెప్పాడు.
|
కుక్కకాటుకు విరుగుడు పొందేందుకు మాన్‌పూర్ గ్రామానికి చెందిన విశాల్ అనే రోగి తన తండ్రితో సహా ఇక్కడకు వచ్చాడు. ఆదివారం మరియు మంగళవారాలలో కనుక ఈ వాగులో స్నానం చేసినట్లయితే కుక్కకాటు విరుగుడుకు ఎటువంటి ఇంజెక్షన్లు చేయించుకోనవసరం లేదనేది విశాల్ తండ్రి విశ్వాసం.
లక్నో సమీపంలోని రాయ్‌బరేలి రోడ్డు, శారద నగర్, రజనీ ఖండ్, సెక్టార్-8కు చెందిన మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ కుమారుడు మహ్మద్ షహీద్‌ను మేము కలిశాము.
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే.. మహాబుల్లాపూర్ వాసి అయిన మున్నాలాల్ గుప్తా కుమారుడైన 10 సంవత్సరాల అంకుర్ కూడా ఇక్కడ చికిత్స పొందేందుకు వచ్చాడు. మూడు సంవత్సరాల క్రితం కుక్కకాటుకు గురైన తన సోదరుడు ఇక్కడి వాగులో స్నానం చేయడం ద్వారా ఉపశమనం పొందాడని మున్నాలాల్ విశ్వసిస్తున్నాడు.
|
ఇదిలా ఉండగా ఒక రోజు భూస్వామి ఇంటి నుంచి కాజేసిన డబ్బును కొందరు దొంగలు బావిలో దాచిపెట్టడాన్ని వారినే అనుసరించి వెళ్ళిన కుక్క గమనిస్తుంది. దొంగలు డబ్బును దాచిన స్థలాన్ని భూస్వామికి కుక్క సంకేతమాత్రంగా తెలియచేస్తుంది. కుక్క చూపిన విశ్వాసానికి మెచ్చిన భూస్వామి కుక్కకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు.
ఇదిలాఉండగా ఆఘ్ఘనిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి, భూస్వామి వద్ద తన పెంపుడు కుక్క లేకపోవడాన్ని చూచి మనస్తాపం చెందుతాడు. తిరిగి వస్తుండగా
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యాధి నివారణకు ఉద్దేశించిన ఇంజక్షన్లు అత్యంత ఖరీదైనవి కావడంతో పేద ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కుంటున్నారు. ప్రస్తుతం, ప్రభుత్వం చవుక ధరలకే ర్యాబీస్ నివారక ఇంజక్షన్లను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేస్తున్నది. కుక్క కరిచిన వెంటనే మొదట స్నానం చేయవలసిందిగా వైద్యులు రోగులకు సూచిస్తున్న అంశాన్ని ఆయన అంగీకరించారు. ర్యాబిస్ కారక వైరస్‌ను నిర్మూలించగల ఏదేని విషపదార్థాల ఉనికిని ఊహించిన ఆయన తన ఊహకు శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం కనుగొనలేకపోయారు.
