ఆత్మ తిరుగాడే దేవాలయం
|
మహరాజా దేవాస్ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెపుతారు. అయితే ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఆ ప్రాంతంలో అనేక భయంకర సంఘటనలు చోటుచేసుకున్నాయి, ఈ దేవాలయానికి రూపకల్పన చేసిన రాజు కుమార్తె దేవాలయంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువరాణి మరణించిన తర్వాత ఆ వేధనను భరించలేక ఆమెను గాఢంగా ప్రేమించిన ఆ రాజ్య సేనాధిపతి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
| |
| |
వారిద్దరూ చనిపోయిన తర్వాత ఆ దేవాలయం కళంకితమైందిగా, అపవిత్రమైందిగా మారిందనీ, అమ్మవారి విగ్రహాన్ని ఉజ్జయినీలో వేరే ఎక్కడైనా ప్రతిష్ఠాపించాలని ఆలయ ప్రధాన పూజారి మహారాజుకు చెప్పాడు. దీనితో అమ్మవారిని ఉజ్జయినిలోని పెద్ద గణపతి దేవాలయంలో సర్వ సంస్కారాలతో ప్రతిష్ఠాపించారు. దుర్గామాత ప్రతిమను కూడా ఖాళీ స్థలంలోనే ఉంచారు. అయితే ఆ తర్వాత కూడా ఆ దేవాలయంలో విచిత్ర సంఘటనలు కొనసాగుతూ వచ్చాయి
|
|
|
|
ఈ గుడిలో పనిచేసే కార్మికులు గుడిలో నుంచి ఓ వెలుగు రావటాన్ని గమనించామంటున్నారు. ఇటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు రావటంతో, ఆలయ నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఎటువంటి మార్పులకు నోచుకోక శిథిలావస్తలో ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఆలయాన్ని సందర్శించి మరింత తరచి చూడాలనుకుంటే... వారు భౌతికంగా అనేక సమస్యలను ఎదుర్కోవటం ఖాయమనీ, ఇటువంటి సంఘటనలను తాను కళ్లారా చూశాననీ సంజయ్ చెపుతున్నాడు.
|
ఈ తరహా సంఘటనలు నిజంగా జరిగేవా లేక వట్టివా అనే సంగతి ప్రక్కన పెడితే... ఈ దేవాలయానికి సంబంధించి విచిత్రంగా షికారు చేస్తున్న కథలతో ప్రజలు ఈ దేవాలయానికి కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే భక్తి, మత విశ్వాసాలతో భక్తులు ఇక్కడకు వస్తూనే ఉన్నారు. ఊహాజనిత కల్పనా భయాలు వారి మనసుల్లో వేళ్లూనుకుని ఉండడంతో సాధ్యమైనంత త్వరగానే ఆ దేవాలయ ప్రాంగణం నుంచి వారు వెళ్లిపోతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో దయచేసి మాకు తెలియజేయండి...
