1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Badrinath temple door will open on May 11

మే11న తెరుచుకోనున్న బద్రినాథ్‌ ఆలయం:వసంత పంచమిని పురస్కరించుకుని..?

Badrinath temple
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన బద్రినాథ్‌ ఆలయ ద్వారాలు మే 11వ తేదీన తెరుచుకోనున్నాయి. ఆ రోజు ఉదయం 4:30గంటలకు పండితుల వేద మంత్రాల నడుమ ఆలయద్వారాలు తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ సీఈవో బీడీ సింగ్‌ తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని ఈరోజు గంటపాటు ఆలయాన్ని తెరిచి పురోహితులు పూజలు జరిపినట్లు ఆయన చెప్పారు. 
 
అలకనంద నది ఒడ్డున, సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో బద్రీనాథుని ఆలయాన్ని ప్రతి ఏడాది మంచు కారణంగా శీతాకాలంలో మూసివేసి వేసవిలో తెరుస్తారు. గతేడాది నవంబర్‌ 17న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి మేలో తెరవనున్నారు. తెరవడానికి ముహూర్తాన్ని వసంత పంచమి సందర్భంగా ఈరోజు నిర్ణయించారు.
About Writer
Selvi