1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 26-08-2026 Daily Astrology

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

Daily Astrology
Daily Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులకు అనుకూలం. శ్రద్ధతో వ్యవహరించాలి. తప్పటడుగు వేసే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
మీ శ్రమ ఫలిస్తుంది. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆశావహదృక్పథంతో అడుగు వేయండి. సాయం అందుతుంది. రావలసిన ధనం గురించి సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. నిస్పృహకు లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ధన సమస్యలు ఎదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. సన్నిహితులను కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విధులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పత్రాల రెన్యూవల్‌లో మెలకువ వహించండి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, కానీ ప్రయోజనకరం. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆశ వదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. మోసగించే వ్యక్తులతో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కుటుంబీకులు మీ మాటను వ్యతిరేకిస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
అభీష్టం నెరవేరుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. బాకీలు వసూలవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు మొదలుపెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. సమర్థతను చాటుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ