సంబంధిత వార్తలు
- అలాంటి వారు శబరిమలకు రావొద్దు : కేరళ సర్కారు ఆదేశాలు
- శ్రీవారి భక్తులు తోసుకోకండి.. మీకు కావాల్సిన టోకెన్లు ఇవిగో రండి
- ఏకాంతంగా శ్రీవారి పట్టపురాణి బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు ఎప్పుడెప్పుడో తెలుసా?
- రూ.కోట్లు కురిపిస్తున్న శ్రీవారి హుండీ.. లాక్డౌన్ తర్వాత తొలిసారి...
- 200 రోజుల తరువాత శ్రీవారి ఉత్సవమూర్తులు ఆలయం నుంచి బయటకు...
కమనీయం.. పద్మావతి అమ్మవారి కుంకుమార్చన
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవోపేతంగా జరిగింది. ఉదయం నుంచి లక్ష కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరుగుతోంది.
వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ముఖమండపంలో కుంకుమార్చనను టిటిడి నిర్వహించింది. కరోనా కారణంగా ఏకాంతంగానే కుంకుమార్చనను నిర్వహించారు. లోక కళ్యాణార్థం కుంకుమార్చనను నిర్వహిస్తున్నట్లు టిటిడి తెలిపింది.
మరో వైపు ఈరోజు సాయంత్రం తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ జరుగనుంది. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం కార్యక్రమాన్ని రేపు ఉదయం నిర్వహించనున్నారు. ఆ తరువాత ఏకాంతంగా వాహనసేవలు జరుగనున్నాయి.
తర్వాతి కథనం
