1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirupati kodanda ramalayam

తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం

tirupati kodanda ramalayam
తిరుపతిలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకంను  టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం 10 గంటలకు ఈ సేవను ప్రారంభించింది. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా శత కలశాభిషేకంను పండితులు పూర్తి చేశారు. అధికసంఖ్యలో భక్తులు ఈ సేవకు హాజరయ్యారు.
 
అష్టోత్తర శతకలశాభిషేకాన్ని పురస్కరించుకుని సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వూరేగిస్తారు. అక్కడి నుంచి శ్రీరామ చంద్ర పుష్కరిణి వద్దకు తీసుకెళ్ళి ఆస్థానం చేపట్టనున్నారు. అనంతరం పుష్కరిణి హారతిని నిర్వహిస్తారు.
About Writer
ttdj