మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు
Written By JSK
Last Modified: శనివారం, 30 జులై 2016 (21:41 IST)

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పానకాల స్వామి ఆలయ చరిత్ర...

పానకాల స్వామి దేవాలయం మెట్ల మొదట్లో ఓ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయా

పానకాల స్వామి దేవాలయం మెట్ల మొదట్లో ఓ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని "జయస్థంభం" అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దాన శాసనాల ప్రసక్తి కూడా దీనిపై ఉంది. 
 
లక్ష్మీనరసింహస్వామి గుడిమీద గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ చెక్కడం లిఖించబడింది.అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 పంక్తులు చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని "ధర్మ శాసనం" అని అంటారు. 
 
చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి. పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమల రాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని గుడికి దానమిచ్చాడు.నంబూరు, తుళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం, తాడికొండ, పెదకొండూరు, గొడవర్తి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల, గోళ్ళమూడిపాడు, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేశాడు. 
 
వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉన్నది. సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉన్నది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.