1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. చెవాకులు

ఇదైనా...నిజమేనంటారా?

హాస్యం చెవాకులు విజయవాడ ఆయేషా మీరా బీఫార్మసీ విద్యార్థిని సత్యంబాబు నిందితుడు పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి
వార్త : విజయవాడ సమీపంలో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబే నిందితుడని నిర్ధారణ అయిందని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

చెవాకు : ఇది నిజమేనంటారా? తానే నిందితుడని సత్యంబాబు చాలా తేలిగ్గా, స్వయంగా అంగీకరిస్తుండటంతో కొంత అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకోసం మీరే అతని పాత్రను సృష్టించలేదు కదా.

ఆ మధ్యలో మరో వ్యక్తిని తీసుకొచ్చి నిందితుడని చెప్పి, ఆ తర్వాత కాదని మాటా మార్చారుగా. అలా చేయొద్దు. ఖచ్ఛితంగా నిర్ధారణ అయితే శిక్ష పడనివ్వండి. కానీ అమాయకుడైతే మాత్రం అనవసరంగా వేధించకండి.

మీరు ఇన్ని చెబుతున్నా ఆయేషా తల్లిదండ్రులు మాత్రం సత్యంబాబును దోషిగా ఎందుకు అంగీకరించనట్టు. దీని వెనుక మరో హస్తం ఉందని వారు భావిస్తున్నారా?

ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే పూర్తి వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంటుంది. మీ పోలీసు సిబ్బందికి ఇంకా ఓపిక ఎక్కడుందంటారా? అదీ కరెక్టే.
About Writer
Srinivasulu