మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 27 మే 2018 (13:48 IST)

జూన్ 14 నుంచి ఫీఫా సాకర్ వరల్డ్ కప్

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగవారంతో వంద రోజులు పూర్తి

జూన్ 14వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక ఫీఫా వరల్డ్ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రీడలకు రష్యా వేదిక కానుంది. ఈ క్రీడల కోసం క్రీఢాభిమానులు, పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాకర్ సమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రష్యా వెళ్లేందుకు క్రీడాభిమానులు, పర్యాటకులు సిద్ధమవుతున్నారు.
 
ఇలాంటివారిలో ఎక్కువమంది భారతీయులే ఉన్నారు. గతేడాదితో పోలిస్తే రష్యా టూర్‌కు వెళ్తున్న భారతీయుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఏకంగా 15 లక్షల మంది భారతీయులు రష్యాలో విహరించేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. వరల్డ్ కప్ కోసం జనవరి నుంచే పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకోవడం గమనార్హం.