చాక్లెట్ బర్ఫీ..?

Last Updated: గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:19 IST)
కావలసిన పదార్థాలు:
పాలు - 400 గ్రా
చక్కెర - 6 స్పూన్స్
నెయ్యి - 1 స్పూన్
బాదం పప్పు - ఆరు
కోకో పౌడర్ - 1 స్పూన్.

తయారీ విధానం:
ముందుగ్ స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. తరువాత అందులో పాలు పోసి చిన్న మంటమీద వుంచి చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. నిమిషం తరువాత కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమమంతా దగ్గరగా చేరి గట్టిపడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు
చిన్న ప్లేటుకు నెయ్యి రాసి దానిపై చాక్లెట్ మిశ్రమాన్ని వేయాలి. అది పూర్తిగా గట్టిపడకముందే నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత బాదం పప్పును చిన్నగా తురిమి ముక్కలపై చల్లుకోవాలి. అంతే.. చాక్లెట్ బర్ఫీ రెడీ.దీనిపై మరింత చదవండి :