శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (21:43 IST)

ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసా?

గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్‌శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. అంతేకాకుండా ఇది శరీర బరువును కూడా తగ్గిస్తుంది. గుడ్డుతో మనం అనేక రకములైన వంటలు చేసుకుంటాము. మరి.... ఇన్ని పోషకాలు ఉన్న గుడ్డుతో బిర్యాని చేస్తే ఆహా.... ఏమి రుచి అనుకుంటూ తినాల్సిందే.
 
ఎగ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు:
కోడిగ్రుడ్లు: ఆరు, 
కొత్తిమీర, పుదీనా తురుము: అరకప్పు,
పచ్చిమిర్చి:ఆరు,
పెరుగు: ఒక కప్పు,
ఆయిల్: మూడు టేబుల్ స్పూన్లు,
అల్లం, వెల్లుల్లి పేస్ట్: మూడు టేబుల్ స్పూన్లు,
కుంకుమపువ్వు: అర టేబుల్ స్పూన్,
కారం, ఉప్పు: సరిపడా,
నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్,
బాస్మతి బియ్యం: నాలుగు కప్పులు,
ఆయిల్: ఒక టేబుల్ స్పూన్,
బిర్యానీ ఆకులు : మూడు,
లవంగాలు :ఐదు,
యాలకులు : ఐదు,
ఉప్పు: తగినంత,
టమాటాలు : రెండు,
ఉల్లి ముక్కలు : కప్పు
 
తయారుచేయు విధానం:
ముందుగా కోడిగ్రుడ్లను ఉడికించి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో నబెట్టుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, అందులో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, పుదినా, ఉప్పు వేసి వండుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి ప్లేటు లోకి తీసుకుని చల్లార్చాలి.
 
కళాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక, పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేపాలి. తర్వాత కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమంలో టమోటా, కోడిగ్రుడ్లు వేసి మసాలా కలిసేలా వేపుకోవాలి. ఇందులో పెరుగు, నిమ్మరసం వేసి పది నిమిషాల వేపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. 
 
ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకున్న అన్నాన్ని వేయాలి. దీని మీద కోడిగుడ్డు మసాలాకలిపి వేయించిన మిశ్రమం వేసిఅంతా సర్దాలి. దీనిపై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు చిలకరించి, కొత్తిమీర చల్లి మూతపెట్టి పదినిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. అంతే.. ఎగ్ బిర్యానీ రెడీ.