ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (21:03 IST)

చిలకడ దుంపల పచ్చడి... చపాతీల్లో తింటే వదిలిపెట్టరు...

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. అంతేకాదు వీటిని చట్నీలాగా కూడా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు
చిలగడ దుంప ముక్కలు - ఒక కప్పు,
మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు,
ఎండుమిర్చి - 5,
చింతపండు - నిమ్మకాయంత,
పచ్చికొబ్బరి తురుము - 4 టేబుల్‌ స్పూన్లు,
నూనె - 2 టీస్పూన్లు. 
తాలింపు కోసం : ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు,
నూనె - తగినంత.
 
తయారుచేసే విధానం:
ఒక స్పూను నూనెలో మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేగించి చల్లారనివ్వాలి. తర్వాత చిలగడ దుంప ముక్కలు, పచ్చికొబ్బరి, చింతపండు, ఉప్పుతో పాటుగా వేగిన పప్పుల మిశ్రమం కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు విడిగా తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి చపాతీలలో, అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.