శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (19:07 IST)

పుట్టగొడుగుల బిర్యానీ ఎలా చేయాలో తెలుసా?

శాకాహారమైన  పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. మాంసంహారం తిన‌ని వాళ్లు పుట్ట‌గొడుగులను తప్పనిసరిగా తమ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటి ద్వారా మాంసాహారం ద్వారా పొందే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఈజీగా పొంద‌వ‌చ్చు. శ‌రీరానికి కావాల్సిన మాంస‌కృత్తులు పుట్టగొడుగుల ద్వారా శ‌రీరానికి ల‌భిస్తాయి. అంతేకాదు పుట్టగొడుగుల్లో పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే సత్తా కూడా దాగుంది. 
 
మష్రూమ్ వంటకాలంటే చాలా మంది జిహ్వ ప్రియులు చెవి కోసుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ టేస్టీ మష్రూమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనిని తయారు చేయడం చాలా సుళువు. ఎలాగో చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు
మష్రూమ్స్ - 15, 
గుడ్లు - రెండు, 
వండిన అన్నం - ఒక పెద్ద కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, 
పచ్చి మిర్చి - అయిదు,
స్ర్పింగ్ ఆనియన్ - ఒక కప్పు, 
చిల్లీ సాస్ - ఒక టీ స్పూను,
టమోటా సాస్ - ఒక టీ స్పూను,
వెనిగర్ - ఒక టీ స్పూను, 
సోయాసాస్ - ఒక టీ స్పూను,
జీలకర్ర - అర కప్పు, 
కొత్తి మీర తరుగు - అరకప్పు,
ఉప్పు - సరిపడా,
నూనె - సరిపడినంత.
 
తయారుచేసే విధానం: 
మష్రూమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెద్ద మష్రూమ్స్ అయితే చిన్నగా కట్ చేయాలి. ఉల్లిపాయల్ని గుండ్రంగా కట్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే అన్నాన్ని పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అవి వేగాక మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక, గుడ్లను పగుల గొట్టి సొనను వేసి బాగా కలపాలి. ఒక నిమిషం వేయించాక ముందు కోసి పెట్టుకున్న ఆనియన్ వేసి వేయించాలి. మిశ్రమం మొత్తం బాగా వేగాక సోయాసాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కళాయిలో వేసి బాగా కలపాలి. కలుపుతున్నప్పుడు టేబుల్ స్పూను వెనిగర్, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే... మష్రూమ్ బిరియానీ రెడీ.