శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:15 IST)

కొత్తిమీర రైస్ తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
పొడి అన్నం - 1 కప్పు
కొత్తిమీర - అరకప్పు
అల్లం ముక్క - చిన్నది
ఇంగువ - కొద్దిగా
జీడిపప్పులు - 10
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా కొత్తిమీర తరుగు, అల్లం ముక్క, పచ్చిమిర్చి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నూనెలో ఇంగువ, జీడిపప్పులు, ఉల్లి తరుగు, కొత్తిమీర మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చిన్నమంటపై ఉంచి ఆ తర్వాత అన్నం చేసి బాగా కలుపుకోవాలి. అంతే... ఘుమఘుమలాడే కొత్తిమీర రైస్ రెడీ.