శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:12 IST)

నోరూరించే ఉసిరి బజ్జీలు ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు: 
బంగాళాదుంపలు - 4
పచ్చిమిర్చి - 5
నూనె - 2 కప్పులు
ఉసిరి తురుము - 4 కప్పులు
ఉప్పు - తగినంత
కరివేపాకు - 2 రెమ్మలు
శెనగపిండి - 1 కప్పు
బియ్యం పిండి - పావుకప్పు
జీలకర్ర - 2 స్పూన్స్
వాము - 2 చెంచాలు
కారం - కొద్దిగా
వంటసోడా - అరస్పూన్
ఆవాలు - స్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించి, పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆపై బాణలిలో రెండు స్పూన్ల నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అవి బాగా వేగాక ఉసిరి తురుము వేసి 2 నిమిషాల తరువాత తగినంత ఉప్పు, బంగాళదుంపల ముద్దా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బుల్లెట్ ఆకృతిలో చేసుకుని పెట్టుకోవాలి. ఆపై ఓ గిన్నెలో శెనగపిండి, బియ్యం పిండి, వంటసోడా, వాము, కారం, కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉసిరి బుల్లెట్లను ముంచి నూనెలో వేయించుకోవాలి. అంతే... నోరూరించే ఉసిరి బజ్జీలు రెడీ.