శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 మార్చి 2019 (21:36 IST)

పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ముల్లంగి బిస్కెట్లు... ఎలా చేయాలంటే?

ముల్లంగిని చాలా మంది ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అసలు ఇ్టపడరు. ఎందుకంటే ముల్లంగి గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. కానీ నిజానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
 
ముల్లంగిని కూరలాగా కాకుండా బిస్కెట్స్ లాగా చేసి పిల్లలకు పెడితే ష్టంగా తింటారు.దాని వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ముల్లంగి బిస్కెట్స్‌ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్దాలు-
ముల్లంగితురుము- ఒక కప్పు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
టూటీప్రూటీ- పావు కప్పు
బియ్యపు పిండి- పావుకప్పు
మొక్కజొన్న పిండి- ఒక టేబుల్ స్పూన్
ఉప్పు- అర టీస్పూన్
చక్కెర- అర టీస్పూన్
ఉల్లికాడలు- ఒక టేబుల్ స్పూన్
 
తయారుచేసే విధానం-
ముల్లంగి తురుములో ఒక కప్పు నీరు పోసి మెత్తగా ఉడికించాలి.అది చల్లరిన తరువాత నీటిని మొత్తం పిండేసి బియ్యపు పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, చక్కెర, ఉల్లికాడలు, టూటీప్రూటీ వేసి గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని రొట్టెలా వత్తి బిస్కెట్స్ ఆకారంలో నచ్చిన సైజులో కత్తిరించుకుని పెనం మీద నూనె వేసి బంగారు రంగు వచ్చేదాక కాల్చుకోవాలి. అంతే... మీరు ఎంతో ఇష్టపడే ముల్లంగి బిస్కెట్స్ రెడీ.