సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (13:45 IST)

మిల్క్ కేక్ ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు:
పాలు - అరలీటరు
చక్కెర - పావుకప్పు
నిమ్మరసం - స్పూన్
పిస్తా, బాదం - కొన్ని
 
తయారీ విధానం:
ముందుగా పాత్రలో పాలు పోసి స్టవ్‌మీద పెట్టి చిన్న మంటమీద మరిగించాలి. ఆపై అందులో నిమ్మరసం పిండి నీళ్లలో కలిపి ఉంచాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కో చుక్కని అందులో కలుపుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పాలు విరిగిపోతాయి. కనుక పాలు విరిగిపోకుండా ఒక్కో చుక్క వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు ఇలా చేయాలి.

ఆపై అందులో చక్కెర కలపి కోవాలా అయ్యేవరకు మరిగించాలి. కోవా దగ్గరకు చేరాక స్టవ్‌మీద నుంచి తీసేయాలి. ఇప్పుడు ఒక ప్లేటు అడుగుకు నెయ్యి రాసి బాదం పిస్తా ముక్కలు చల్లాలి. దానిపై కోవా మిశ్రమాన్ని వేయాలి. ఒక ఆకారంలో ఆ మిశ్రమాన్ని సర్ది చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అంతే... మిల్క్ కేక్ రెడీ.