శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (14:04 IST)

క్యాప్సికం సూప్‌...?

కావలసిన పదార్థాలు: 
దోరమాగిన టమేటోలు - 6 
దోసకాయలు - 2
కొత్తిమీర - 4 కాడలు 
రెడ్‌ క్యాప్సికం - 1 
గ్రీన్‌ క్యాప్సికం - 1 
నూనె - 50 గ్రా 
మిరియాలపొడి - చిటికెడు 
ఉప్పు- రుచికి సరిపడా.
 
తయారుచేసే విధానం: 
ముందుగా టమోటో, దోసకాయల తొక్కను, గింజల్ని తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికంలోని గింజల్ని కూడా తీసి అంగుళం ముక్కలుగా తరుక్కోవాలి. అన్నిటినీ కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత మిరియాలపొడి, ఉప్పు కలిపి అవసరమైతే కొద్దిగా మంచినీటిని కూడా కలుపుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. చల్లబడ్డాక కొత్తిమీరతో అలంకరించి తాగాలి.