శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (12:09 IST)

హనీ కేక్ ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు:
మైదా - 1 కప్పు
చక్కెర - 1 కప్పు
వెన్న - 100 గ్రా
గుడ్లు - 2
పాలు - 3 స్పూన్స్
వెనీలా ఎసెన్స్ - అరస్పూన్
తేనె - అరకప్పు
జామ్ - 5 స్పూన్స్
పచ్చికొబ్బరి - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా మైదా, చక్కెర, సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని ఓవెన్‌లో బేక్ చేయాలి. లేదా కుక్కర్‌లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఆ తరువాత బయటకు తీసి చల్లారనివ్వాలి. మరో గిన్నెలో తేనె, స్పూన్ చక్కెర, అరకప్పు నీళ్లు పోసి కలుపుకుని కేక్ మీద సమానంగా పరవాలి. ఆపై మిగిలిన చక్కెర జామ్‌లో వేసి చిన్న మంట మీద 2 నిమిషాలు వేడిచేయాలి. జామ్‌‌ను కేక్ మీద సమానంగా రాసి.. చివరగా కొబ్బరి తురుము చల్లుకోవాలి. అంతే... హనీ కేక్ రెడీ.