మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (11:17 IST)

యాంకర్ లాస్య.. దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చేసేసింది.. టేస్ట్ చేస్తారా? (video)

యాంకర్ లాస్య కొత్త అవతారం ఎత్తింది. చెఫ్‌గా మారిపోయింది. కొత్తగా ఆమె ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్‌లో దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్పుకొచ్చింది. లాస్య టాక్స్‌తో సరికొత్తగా తన వంట టాలెంట్ చూపించేందుకు సిద్ధమైంది. ఈ యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా వంటకం పోస్టు చేసింది. 
 
ఇకపోతే.. యాంకర్ లాస్య తల్లి కాబోతున్న విషయాన్ని ఫోటోలతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా ఇటీవల యాంకర్ లాస్య సీమంతం వేడుకగా అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం లాస్య సీమంతానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బుల్లితెర యాంకర్ అయిన లాస్య సమ్‌థింగ్ స్పెషల్ అనే షో ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవితో కలిసి ఈ షో చేసిన లాస్య.. తన చిన్ననాటి స్నేహితుడు మంజునాథ్‌ను పెళ్లాడింది. 2017 ఫిబ్రవరి 15వ తేదీన వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.