గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (18:13 IST)

చెన్నైలో శ్రీరెడ్డి ఇంటిపై దాడి.. పోలీసు ఇన్వెస్టిగేషన్

'కాస్టింగ్ కౌచ్‌'తో మొదలెట్టి... ఎక్కడెక్కడో చుట్టి వచ్చి... హీరోలనీ... వాళ్ల తండ్రులనీ... ఆ లెక్కన చూస్తే... సినీ పరిశ్రమలోని పురుష జాతిని మొత్తం విలన్‌లుగా చిత్రీకరించేస్తూ మీడియా ముందుకి వచ్చి... తనకు తెలిసిన కొన్ని నిజాలకు అనేక బూతు పదాలను కలుపుతూ... తెలుగు సినీ పరిశ్రమని రోడ్డు మీదకు లాక్కొచ్చేసిన శ్రీరెడ్డి సంచలనాలు ఇప్పుడు తమిళనాడుకి కూడా పాకాయి. 
 
గత కొన్ని రోజులుగా చెన్నైలోనే ఉంటున్న ఈవిడ... అక్క‌డే ఉండి త‌మిళ సినిమాల్లో న‌టిస్తోందట‌. పైగా ఈమె బ‌యోపిక్ "రెడ్డీస్ డైరీ" కూడా అక్క‌డే తెర‌కెక్కుతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా, ఆ మ‌ధ్య వ‌ర‌ుస‌గా తెలుగు సెలబ్రెటీల‌పై నోరు పారేసుకున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు త‌మిళ‌నాడు పరిస్థితులపై కూడా పారేసుకోవడం మొదలెట్టింది. అక్క‌డ కూడా కొంద‌రు టాప్ హీరోల‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇంటిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేయడం జరిగింది.
 
ఇప్పుడు ఈ ఘ‌ట‌న టాలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపుతోంది. చెన్నైలో తాను ఉంటున్న ఇంటికి అర్థరాత్రి వ‌చ్చి ఇద్ద‌రు దుండ‌గులు దాడి చేసార‌ని వ‌ల‌స‌ర‌వాక్కం పోలీస్ స్టేషన్‌లో ఈ భామ కేసు పెట్టిందట‌. ఇంత‌కీ ఈవిడ చేసిన త‌ప్పేమిటంటో... పొల్లాచ్చి సెక్స్ రాకెట్ గురించి మాట్లాడ‌డ‌మే. ఎంతోమంది అమాయ‌క‌మైన అమ్మాయిలు ఇందులో బ‌లైపోయారు. అందులో త‌మిళ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉన్నార‌ంటూ ఆరోపణలు గుప్పించింది. అంతే, ఆమెపై కొందరు దుండగులు దాడికి యత్నించారు. 
 
ఈ దాడిపై శ్రీరెడ్డి తక్షణం స్పందించారు. ఇలాంటి దాడులకు భయపడబోనని పొల్లాచ్చి ఘటనపై తాను మాట్లాడుతానని చెప్పారు. తన ఇంటిపై జ‌రిగిన దాడిలో కాస్తలో త‌న‌కు ప్రాణాపాయం త‌ప్పింద‌ని ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసుని చెన్నై పోలీసులు ధ‌ర్యాప్తు చేస్తున్నారు. 
 
క్యాస్టింగ్ కౌచ్ గొడ‌వ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీని వ‌దిలేసి చెన్నైలో సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ‌... ఇప్పుడు అక్క‌డ కూడా ర‌చ్చ మొద‌లు పెట్టేసింది. మ‌రి ఈ కేస్ ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో... ఈసారి మకాం ఎక్కడికి మార్చుతుందో చూడాలి.