మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:56 IST)

ఎన్ని సినిమాలు చేసినా ఒక్క అవార్డు కూడా రాలేదు.. హీరోయిన్

మణిరత్నం సినిమాలలో సూపర్‌హిట్ సినిమాకు పేరున్న "రోజా" సినిమాలో హీరోయిన్‌గా నటించిన మధుబాలకు అప్పట్లో చాలా మంచి పేరు వచ్చింది. ఇక "జెంటిల్‌మెన్" సినిమాలో హీరోయిన్‌గా నటించిన మధుబాల తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క అవార్డు కూడా రాలేదని ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డారు. 
 
వివాహం చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మధుబాల తిరిగి 2008లో ‘కభీ సోచా భీ నా థా’ అనే హిందీ సినిమాలో కనిపించారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 2008లోనే మొదలుపెట్టినప్పటికీ 2013లో ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు సినిమాలో దర్శనమిచ్చారు. ఇక ఇప్పుడు తమిళంలో ‘అగ్ని దేవి’ అనే సినిమాలో శక్తివంతమైన రాజకీయ నాయకురాలి పాత్ర నటించి మెప్పించడానికి సిద్ధమయ్యారు. 
 
ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో నావన్నీ మంచి పాత్రలే. కానీ నాకు అవార్డ్ ఏదీ రాలేదు. అదే నన్ను బాధపెడుతోంది. అందుకే మళ్లీ నటించాలని నిర్ణయించుకున్నాను. ‘అగ్నిదేవి’ సినిమాలో నా పాత్ర నిజ జీవితంలో ఎక్కడా కనిపించదు, కేవలం కల్పితంగా సినిమాలలో మాత్రమే నటించగలము. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కనీసం ఒక్క అవార్డ్ అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్నానని పేర్కొన్నారు.