శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (11:41 IST)

పన్నీర్ కట్లీ ఎలా చేయాలంటే..?

కావలసిన పదార్థాలు:
క్యారెట్స్ - 30 గ్రా
క్యాప్సికం - 30 గ్రా
క్యాబేజి - 15 గ్రా
బంగాళాదుంపలు - 15 గ్రా
నెయ్యి - 20 గ్రా
షాజీరా - 3 గ్రా
కారం - 5 గ్రా
పసుపు - 3 గ్రా
జీలకర్ర పొడి - 5 గ్రా
గరంమసాలా - 2 గ్రా
పన్నీర్ ముక్కలు - కొన్ని
బ్రెడ్ పొడి - 50 గ్రా
చాట్‌మసాలా - 10 గ్రా
ఉప్పు - సరిపడా
మొక్కజొన్న పిండి - 10 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యితో షాజీరాని పోపు చేసుకోవాలి. ఆపై సన్నగా తరిగిన కూరగాయల ముక్కల్ని వేసి వేగించాలి. ఆ తరువాత మిగిలిన పొడులన్నీ వేసి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. తరువాత పన్నీర్ ముక్కలపై కూరగాయల వేపుడును కొద్దిగా వేసి చుట్టాలి. ఇక జారుగా కలుపుకుని ఉంచుకున్న మైదా, మొక్కజొన్న పిండిలో పన్నీర్ రోల్స్‌ని ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి రెండు వైపులా నేతిలో దోరగా వేగించుకోవాలి. అంతే... టేస్టీ టేస్టీ పన్నీర్ కట్లీ రెడీ.