శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (21:15 IST)

ఈ మిల్క్ షేక్‌లతో సమ్మర్‌ను షేక్ చేసేయండి...

చూస్తుండగానే ఈ ఏడాది సమ్మర్ ముంచుకొచ్చేసింది. ఎండలు భగ్గుమంటున్న వేసవిలో చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజం. అయితే బజార్లో దొరికే కూల్‌డ్రింక్స్, ఐస్‌ క్రీంలు తింటే ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. సరేలే పోనీ పళ్లరసాలు, మిల్క్ షేక్‌లతో అయినా పని కానిద్దామనుకుంటే బయట షాప్‌లో అమ్ముతున్నవాటిలో ఎలాంటి నీరు, పండ్లు వాడతారో తెలీదు కాబట్టి, అదీ ప్రమాదమే. మరెలా అనుకుంటున్నారా, మీ కోసమే ఇంట్లో తయారుచేసుకోగల ఈ మిల్క్‌షేక్‌ల గురించి అందిస్తున్నాము. వీటితో కడుపు చల్లబడుతుంది, ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తాము కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది.
 
కావల్సిన పదార్థాలు: వేడి చేసి చల్లార్చిన పాలు, చక్కెర మరియు ఏ మిల్క్ షేక్ చేయాలనుకుంటున్నారో ఆ పండ్ల ముక్కలు. ఉదాహరణకు, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మిక్సీ జార్‌లో పాలు, పంచదార, కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. తాగేముందు తీసుకుని కొన్ని స్ట్రాబెర్రీ ముక్కలతో, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. 
 
మీకు ఐస్ క్రీం వేసుకోవడం ఇష్టమైతే అందులో వెనీలా ఐస్ క్రీమును కూడా కలుపుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఏ ఫ్రూట్‌తో అయినా మిల్క్ షేక్ తయారుచేసుకోవచ్చు. వేసవికాలంలో బనానా, మ్యాంగో, కివీ మిల్క్ షేక్‌లు తాగడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. కేవలం ఫ్రూట్స్‌తోనే కాదు ఖర్జూరం, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌తో కూడా మిల్క్ షేక్‌లు తయారుచేసుకోవచ్చు.