మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By కుమార్ దళవాయి
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (19:24 IST)

వేసవిలో పురుషులు వారానికి రెండుసార్లే శృంగారంలో పాల్గొనాలా? ఎందుకు?

వేసవిలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉండటం వల్ల ఆ ప్రభావం పురుషుల వీర్యంపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

మిగతా కాలాలతో పోల్చితే వేసవి కాలంలో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య బాగా తగ్గుతుందని కాబట్టి వారానికి వేసవిలో వారానికి రెండుసార్లు మాత్రమే శృంగారంలో పాల్గొనడం మంచిదని సూచిస్తున్నారు. ఇంటిపట్టున ఉండేవారు లేదా ఆఫీసుల్లో ఉండేవారితో పోల్చితే బయట తిరిగే వ్యక్తుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు.
 
వేసవిలో వీర్య కణాలు తగ్గిపోకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు త్రాగాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదని, రాత్రివేళల్లో లోదుస్తులు వేసుకోవడం పూర్తిగా మానేయాలని తెలియజేస్తున్నారు. వేసవిలో బిగుతైన జీన్స్ లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే దుస్తులనే ధరించాలని చెబుతున్నారు. వీర్య కణాల విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే వైద్యులను కలిసి హోర్మోన్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.