సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (13:17 IST)

స్వీట్ కార్న్ పాయసం...?

కావలసిన పదార్థాలు: 
కార్న్‌ - 1 
పాలు - 2 కప్పులు 
యాలకుల పొడి - అర స్పూన్ 
నెయ్యి - అరస్పూన్ 
పంచదార - 4 స్పూన్స్ 
పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు - కొద్దిగా 
కుంకుమ పువ్వు - చిటికెడు.
 
తయారీ విధానం: 
ముందుగా మిక్సీలో కార్న్‌ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేడిచేసి ఈ ముద్దను అందులో వేసి 4 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి. ఆ తర్వాత అందులో పాలు పోసి కలపాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచుకోవాలి. పాయసాన్ని చిన్న మంట మీద ఉంచి 8 నిమిషాల పాటు అడుగంటకుండా ఉడికించాలి. దీంట్లో చక్కెర కలపాలి. పాయసం చిక్కబడేవరకూ ఉడికించి యాలకుల పొడి వేయాలి. చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా చల్లి సర్వ్‌ చేయాలి. అంతే... స్వీట్ కార్న్ పాయసం రెడీ.