గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (12:33 IST)

మామిడి పకోడీలు ఎలా చేయాలంటే..?

కావలసిన పదార్థాలు:
మామిడికాయ - 1
శెనగపిండి - అరకప్పు
బంగాళాదుంప - 1
ఉల్లిపాయ - 1
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా మామిడికాయ తొక్కని చెక్కేయాలి. ఆ తరువాత ముక్కలుగా కట్‌చేసి తురిమేసుకోవాలి. అలానే బంగాళాదుంపని కూడా తురుములా తరిగేయాలి. ఆపై ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి కూడా తరిగేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో శెనగపిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి కలిపి ఉప్పు, మామిడి తురుము, బంగాళాదుంప తురుము, ఉల్లిపాయ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టి తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనెను వేడిచేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఆ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని బంగారురంగు వచ్చే వరకు వేయించుకుని తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. అంతే... వేడివేడి మామిడి పకోడీలు రెడీ.