శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:29 IST)

ఓట్స్ ఊతప్పం..?

కావలసిన పదార్థాలు:
ఓట్స్ - 2 కప్పులు
ఉప్మా రవ్వ - పావుకప్పు
పెరుగు - 1 స్పూన్
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కరివేపాకు - కొద్దిగా
బేకింగ్ సోడా - 1 స్పూన్
క్యారెట్ తరుగు - పావుకప్పు
ఉల్లిపాయ తరుగు - పావుకప్పు
టమోటా తరుగు - పావుకప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా గిన్నెలో టమోటా, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి తరుగులు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్‌ను మిక్సీలో వేసి కాస్త పొడిలా చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా పెరుగు వేసి మళ్లీ మిక్సీ చేసి బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు కలిపి అల్లం తరుగు, కరివేపాకు, ఉప్పు, బేకిండా సోడా వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఆ తరువాత పెనాన్ని వేడిచేసి దానికి కాస్త నూనె రాసి ఓట్స్ మిశ్రమాన్ని ఊతప్పంలా పోసుకుని పైనా ముందుగా కలిపి పెట్టుకున్న టమోటా మిశ్రమాన్ని చల్లుకోవాలి. ఆ తరువాత కొన్ని చుక్కల నూనె చల్లి మూత పెట్టాలి. ఆపై మీడియం మంటమీద 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం ఊతప్పాన్ని తిరగేసి రెండో వైపు కూడా ఉడకనివ్వాలి. అంతే... వేడివేడి ఓట్స్ ఊతప్పం రెడీ.