1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. స్వీట్లు

పెసరపప్పు హల్వా

పెసరపప్పు హల్వా నెయ్యి పంచదార కోవా ఏలకుల పొడి
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు... 2 కప్పులు
నెయ్యి... అరకప్పు
పంచదార...1 కప్పు
కోవా... అరకప్పు
ఏలకుల పొడి... పావు టీస్పూను
జీడిపప్పు... 2 టీస్పూన్లు
కిస్‌మిస్... 2 టీస్పూన్లు

తయారీ విధానం :
ముందుగా పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పంచదార, పెసరపప్పు మిశ్రమం కలిపి ఉడికిస్తూ... నెయ్యిని కూడా అందులో చేర్చాలి. తరువాత కోవా కలిపి, ఏలకుల పొడి, కిస్‌మిస్, జీడిపప్పు కలిపి దించాలి. అంతే వేడి వేడి పెసరపప్పు హల్వా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడిచేసిన వారు ఇది తింటే చలువ చేస్తుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి