SHO లక్ష్మీ మాధవి అదుర్స్.. తప్ప తాగిన తండ్రికి కుమారుడితో బుద్ధి చెప్పారు...(video)
హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి భావోద్వేగపూరితంగా కౌన్సెలింగ్ ఇవ్వడం నెట్టింట వైరల్ అవుతోంది. నిత్యం మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పట్టుకునే పనిలో ట్రాఫిక్ పోలీసులు వుంటారనే సంగతి తెలిసిందే.
తాజాగా తన భార్య, చిన్న కొడుకుతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మద్యం సేవించినట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లోని SHO లక్ష్మీ మాధవి వినూత్న రీతిలో జోక్యం చేసుకుని, ఆ వ్యక్తి కొడుకు ద్వారా తన తండ్రికి సందేశం ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఆ బాలుడు తన తండ్రిని వేడుకుంటున్నాడు. "నాన్న, నాకు నువ్వు కావాలి. దయచేసి తాగి వాహనం నడపకండి." తన కొడుకు మాటలకు కదిలిన తండ్రి కన్నీళ్లు పెట్టుకుని, తన బిడ్డను కౌగిలించుకుని, ఇంకెప్పుడూ మద్యం సేవించి వాహనం నడపనని హామీ ఇచ్చాడు.
రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ భావోద్వేగ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం కూడా సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి ఆ బాలుడి ద్వారా తండ్రికి బుద్ధి చెప్పారు. సాధారణంగా తాగి బండి నడిపితే చలాన్లు, ఫీజులు వేస్తారు. కానీ లక్ష్మీ మాధవి మాత్రం.. తన కుమారుడి ద్వారా ఆ తండ్రికి బుద్ధి చెప్పడం సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.