శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:28 IST)

అభిమానులకూ, తల్లిదండ్రులకు పాఠాలు నేర్పిన 2024 సినిమా రంగం- స్పెషల్ స్టోరీ

Theater fans
Theater fans
పిల్లల పెంపకంలో లోపాలు జరిగితే అది తల్లిదండ్రుల బాధ్యతే. ముందుగా గురువులు పిల్లలని మంచి శిక్షకులుగా తీర్చిదిద్దాలి. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. అలా కాకుండా తల్లి దండ్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే సంథ్య థియేటర్ సంఘటనలు వంటివి జరుగుతాయని సినీరంగ ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగు టీవీ, చలన చితరంగ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ, నటీనటులకు అభిమానులుండవచ్చు. కానీ మరీ మూర్ఖంగా వుండకూదని విశ్లేషించారు. పుష్ప 2 ఉదంతం దేశాన్ని కదలించింది. నేడు కన్నడ నటుడు యష్ కూడా  తన అభిమానులనుద్దేశించి ఆరోగ్యం, భ్రదత అవసరం అని చెప్పారు. గతంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ వంటివారు కూడా ముందుగా తల్లిదండ్రులు మీకు హీరో. బాగా చదువుకుని ఆ తర్వాత సినిమా థియేటర్లలో కటౌట్లు పెట్టుకోండి. నలుగురు మంచి పనులు చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. అసలు ఇటువంటి దుర్ఘటపై ఇయర్ ఎండింగ్ స్పెషల్ స్టోరీ.
 
మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిపోవడం, పిల్లాడి తల్లి రేవతి చనిపోయిన తరవాత ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు, ఆలోచనలు ప్రతీవారికీ కలిగాయి.
 
అసలు అమ్మానాన్నలుగా మన భాధ్యత ఏంటి? మనుషులుగా మన ప్రాధాన్యత ఏంటి? ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం.
 
హాస్పటల్లో ఉన్న శ్రీతేజ్ తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి - 1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు. 2. మేము పుష్ప అని పిలుస్తాము. 3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము. 4. రీల్స్ కూడా చేశాడు పుష్ప సినిమా మీద. ఇవి నిస్సుగ్గుగా చెబుతుంటో అదేదో ఘనకార్యంగా ఆ తండ్రి చెప్పడం మేథావులను ఆశ్చర్యపరిచింది.
 
ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే తెల్లని కాగితంతో పుట్టాడు ఆ బాబు. ఆ కాగితం మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా? అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే. 
 
ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప... పుష్ప అని పిలిచారు. 
 
పుష్ప 1 సినిమాకి U/A 13+ రేటింగ్ ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా.  అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా) ఎక్కువ ఈ బేస్ మీద వున్నాయి. దానికి తీసే దర్శకులు, హీరోలు, పెట్టే నిర్మాతలు కూడా బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఇటువంటి సినిమాల్లో - వీరత్వం, ఎత్తులు, పంచ్ డైలాగ్స్, అశ్లీలత, రూల్స్ బ్రేక్ చెయ్యడం వంటివేగా? ఇంతకంటే మంచి మాటలు, సందేశం అనేది వుంటాయా?
 
చిన్న పిల్లల మెదళ్ళు స్పాంజ్ ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది.
 
సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు? ఇంట్లో పిల్లల్ని... సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు? సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? 
 
ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి?  "సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?", అంటూ మాట్లాడితే, పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బొబ్బో అని మాట్లాడితే... పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. అగ్రెసివ్ గా ఉంటేనే హీరో అనుకుంటారు. రెక్లెస్ గా మాట్లాడితేనే స్టయిల్ అనుకుంటారు. ఇవన్నీ ఎందుకు తల్లిదండ్రులు గ్రహించరు?
 
అలా కాక... మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరం లో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే...   హీరో అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా?
 
ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం ప్రధాన ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది మేథావులు అభిప్రాయం. అమ్మానాన్నలు, ఇంట్లో "ఫ్యాన్" అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత చక్కటి అర్థవంతమైన నిర్వచనాన్ని ఇవ్వాలి. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి. మనం మారితేనే... పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు.
 
ఒకప్పుడు వినోదాంశాలు పెద్దగా వుండేవికాదు. ఒక్క సినిమానే వినోదం. కానీ నేడు పలు వినోదాలు మన ముంగిట వున్నాయి. అందుకే భావిభారత పౌరుల్ని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి. లేదంటే శ్రీతేజ్ లాంటి అర్థంతర జీవితాలు కళ్ళముందు కనిపిస్తాయి. ఇప్పుడు హీరో యష్ అభిమానులకు రాసిన లేఖలోని సారాంశంకూడా ఇంచుమించు అటువంటిదే. ఇప్పటికైనా తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఎంతైనావుంది.